News August 5, 2024

నేడు వరంగల్ మార్కెట్ పున: ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచిధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

Similar News

News September 18, 2024

MHBD: పెళ్లి కావట్లేదని యువతి మృతి

image

పెళ్లి కావట్లేదని మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన MHBD జిల్లాలో జరిగింది. డోర్నకల్ ASI కోటేశ్వర రావు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం తోడేళ్లగూడేనికి చెందిన కళ్యాణి(21) ఏడాది క్రితం డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో కళ్యాణికి కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. వివిధ కారణాలతో కుదరట్లేదు. దీంతో మనస్తాపానికి గురై ఎలుకమందు తిని ఆత్మహత్య చేసుకుంది.

News September 18, 2024

రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి కొండా సురేఖ

image

రాష్టంలోని పలు దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, తదితర అంశాలపై సెక్రటేరియట్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్ రావు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 18, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ

image

వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీకి అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన మెదక్ ఎంపీకి స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.