News January 2, 2025

నేడు వరంగల్ మార్కెట్ రీ ఓపెన్

image

వరంగల్ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించగా నేడు ప్రారంభమవుతుందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. ఉ.6 గం.ల నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభంఅవుతాయన్నారు. రైతులు నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచిధర పొందాలని సూచిస్తున్నారు.

Similar News

News November 3, 2025

వైద్య సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ

image

వైద్య ఆరోగ్య సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలపై దిశా నిర్దేశం చేశారు. వైద్య సిబ్బంది గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య సమాచారాన్ని సేకరించాలని, అలాగే మందుల నిల్వలపై ఆరా తీయాలని ఆయన సూచించారు.

News November 3, 2025

చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండాలి: మంత్రి వాకిటి

image

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 122 కోట్ల వ్యయంతో 83 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను 26 వేల నీటి వనరుల్లో నవంబర్ 20లోపు విడుదల చేయాలని ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 6 నుంచి చేప పిల్లల పంపిణీ ప్రారంభమవుతుందని కలెక్టర్ సత్య శారద తెలియజేశారు.

News November 2, 2025

గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అప్ప నాగరాజు (34) అనే ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు దిగజారడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.