News April 15, 2025
నేడు విచారణకు రానున్న వంశీ బెయిల్ పిటిషన్

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. విజయవాడ SC, ST కోర్టు న్యాయ అధికారి హిమబిందు గత శుక్రవారం ఈ పిటిషన్ విచారించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే.
Similar News
News December 7, 2025
కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.
News December 7, 2025
మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి

మహానటి సావిత్రి పేరుతో ఆమె జన్మస్థలమైన గుంటూరు జిల్లా చిర్రావూరులో కళ్యాణ మందిరం నిర్మించనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. NTPC వారి సీఎస్ఆర్ నిధులు కింద రూ. 2కోట్లు మంజూరు చేశారన్నారు. గతంలో తాను తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో చిర్రావూరులో సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు.
News December 7, 2025
కృష్ణా: స్క్రబ్ టైఫస్తో వ్యక్తి మృతి

ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన శివశంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ నెల 2న శాంపిల్స్ తీసుకోగా, రిపోర్ట్ రాకముందే 4వ తేదీన ఆయన మృతి చెందారు. శనివారం వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే చేపట్టింది.


