News April 25, 2024
నేడు విజయనగరంలో చంద్రబాబు, పవన్ రోడ్ షో

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. డెంకాడ మండలం సింగవరం వద్ద సా.4 గంటలకు ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో వారు పాల్గొంటారు. సభ జరిగే ముందు సింగవరం వద్ద రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం విజయనరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రజాగళం సభలో వారు ప్రసంగించనున్నారు. వీరి పర్యటన నిమిత్తం చందకపేట వద్ద రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు.
Similar News
News December 4, 2025
VZM: జిల్లా వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్-టీచర్ మీట్

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, నైపుణ్యాలు, పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు పాఠశాలల్లో పాల్గొననున్నారని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్నారు.
News December 4, 2025
VZM: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ సీఐ లక్ష్మణ రావు తెలిపారు.
News December 4, 2025
VZM: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ మార్గంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులతో గురువారం వీసీ నిర్వహించారు. రాజీ పడదగిన కేసులను ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోక్ అదాలత్‌పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు.


