News August 6, 2024

నేడు విజయవాడకు రానున్న మాజీ సీఎం

image

జగ్గయ్యపేట వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై ఆదివారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం జగన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News September 12, 2024

విజయవాడ: నీటి గోతిలో ఇరుక్కుపోయిన మంత్రి కారు

image

విజయవాడలో మంత్రి నారాయణ, బొండా ఉమామహేశ్వరావుతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ కారు నీటి గోతిలో కూరుకుపోయింది. సిబ్బంది క్రేన్ సహాయంతో కారును గోతిలో నుంచి వెలికితీశారు. అనంతరం మంత్రి పర్యటన కొనసాగింది.

News September 12, 2024

విజయవాడ వరద బాధితులకు కీలక ప్రకటన

image

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎన్యుమరేషన్‌లో ఇబ్బంది ఎదురైతే ప్రజలు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం 0866- 2574454, VMC కార్యాలయం- 8181960909 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ జి.సృజన సూచించారు. ఇంటి వద్ద ఎన్యుమరేషన్‌ జరగని పక్షంలో ఈ నెల 12, 13 తేదీల్లో తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించి చేయించుకోవాలని సూచించారు.

News September 12, 2024

కృష్ణా:70 మంది వరద బాధితులకు పాము కాటు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంభవించిన వరద విపత్తు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. వరద నీటితో పాటు కొట్టుకొస్తున్న పాములు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో 70 మంది పాముకాటుకు గురయ్యారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులకు పాము కాట్ల బాధితులు వస్తున్నారన్నాయి.