News September 28, 2024

నేడు విజయవాడకు రానున్న శ్రీలీల

image

నేడు విజయవాడకు ప్రముఖ సినీ నటి శ్రీలీల రానున్నారు. ఎంజీ రోడ్డులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు గడ్డే రామ్మోహన్, బోండా ఉమాహేశ్వరరావు, సుజనా చౌదరి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా హాజరుకానున్నారని సమాచారం.

Similar News

News December 22, 2025

కృష్ణా: పల్స్ పోలియో నిర్వహణలో మన జిల్లాకే స్టేట్ ఫస్ట్.!

image

5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 మంది చిన్నారులకు గాను 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.

News December 22, 2025

నేడు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.