News September 19, 2024
నేడు విజయవాడలో పవన్‌ను కలవనున్న బాలినేని

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీకానున్నారు. ఈ మేరకు గురువారం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌తో చర్చలు అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
Similar News
News December 22, 2025
కృష్ణా: పల్స్ పోలియో నిర్వహణలో మన జిల్లాకే స్టేట్ ఫస్ట్.!

5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 మంది చిన్నారులకు గాను 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.
News December 22, 2025
నేడు కలెక్టరేట్లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్: కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్లో నేడు ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉదయం 10.30 నుంచి మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు.