News March 10, 2025

నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన 

image

విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఫార్చ్యూన్ మురళి పార్క్‌లో నేడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. మంటాడ 2 మ్యాన్ హ్యూటన్ అనే పుస్తకాన్ని సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకం నోరి దత్తాత్రేయుడు రచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కూడా అతిథులుగా పాల్గొననున్నారు. 

Similar News

News November 18, 2025

రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

image

పేరెంట్-టీచర్స్ మీటింగ్‌ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.