News August 12, 2024
నేడు విజయవాడ రానున్న హీరో విక్రమ్
తంగలాన్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరో విక్రమ్ సోమవారం విజయవాడ రానున్నారు. ఉదయం 11 గంటలకు విక్రమ్‌తో పాటు చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని ఈ మేరకు తాజాగా సమాచారం వెలువడింది. అనంతరం 12 గంటలకు పరిటాలలో MVR కళాశాలకు, మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు VVIT కళాశాలకు తంగలాన్ బృందం వెళ్లనున్నారు.
Similar News
News September 15, 2024
విజయవాడ: అధికారులపై సస్పెన్షన్ వేటు
ముంబై సినీ నటి కాదంబరి కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా, పోలీస్ అధికారి విశాల్‌గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ వర్గాల నుంచి ఉత్వర్వులు తాజాగా వెలువడ్డాయి. కాగా ఈ కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల సస్పెండ్ చేశారు.
News September 15, 2024
తిరువూరులో చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి
తిరువూరులోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కూలీ పని నిమిత్తం చెట్టు ఎక్కి కొమ్మలను నరికే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. ఈక్రమంలో గేటుకి ఉన్న స్తూపం దిగబడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మునకుళ్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2024
విస్సన్నపేట: బాలికపై హత్యాచారం
విస్సన్నపేటలో శనివారం పైశాచికత్వం బయటపడింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శివయ్య (40) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అతనిపై పోలీస్ స్టేషన్లో (సెక్షన్4)పోక్సో యాక్ట్ 64(1) BNS, కేసు నమోదు చేశామని తిరువూరు సీఐ కె. గిరిబాబు, విస్సన్నపేట ఎస్సై రామకృష్ణ తెలిపారు.