News February 12, 2025

నేడు వినుకొండకు రానున్న కలెక్టర్ అరుణ్ బాబు

image

వినుకొండలో త్వరలో ఏర్పాటు చేయబోయే లెదర్ పార్క్ స్థల పరిశీలనకు పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు బుధవారం ఉదయం 10:00 గంటలకు వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మల్టీ నేషనల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గ ప్రజలు గమనించగలరు.

Similar News

News November 8, 2025

‘నీ భర్త అంకుల్‌లా ఉన్నాడు’ అని కామెంట్.. భార్య ఏం చేసిందంటే?

image

UP మీరట్‌కు చెందిన అంజలి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంజలి, తన భర్త రాహుల్‌తో కలిసి ఇన్‌స్టా రీల్స్ చేసేది. ‘నువ్వు అందంగా ఉన్నావ్. నీ భర్తే అంకుల్‌లా ఉన్నాడు’ అని కామెంట్ రావడంతో అంజలి సహించలేకపోయింది. అదే గ్రామానికి చెందిన అజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియగానే ప్రియుడితో కలిసి అతడిని తుపాకీతో కాల్చి చంపింది. పోలీసులు అంజలి, అజయ్‌ను అరెస్టు చేశారు.

News November 8, 2025

ఐదో టీ20: భారత్ ఫస్ట్ బ్యాటింగ్

image

భారత్‌తో జరుగుతోన్న ఐదో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తిలక్‌కు రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు.

IND: అభిషేక్, గిల్, సూర్య(C), రింకూ సింగ్, జితేష్, సుందర్, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, డేవిడ్, ఫిలిప్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, బార్ట్‌లెట్, ఎల్లిస్, జంపా

News November 8, 2025

అణ్వాయుధ దేశంగా పాక్.. ఇందిర నిర్ణయమే కారణం: మాజీ CIA

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం వల్లే పాక్ అణ్వాయుధ దేశంగా మారిందని US CIA మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో వెల్లడించారు. ‘భారత్, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేసి ఇస్లామాబాద్‌ కహుతా అణు తయారీ కేంద్రంపై దాడికి సిద్ధమయ్యాయి. దీనికి అప్పటి ప్రధాని ఇందిర అంగీకరించలేదు. ఈ దాడి జరిగి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవి. పాక్ అణ్వాయుధాలు తయారు చేసేది భారత్‌‌ను ఎదుర్కొనేందుకే’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.