News June 14, 2024

నేడు విశాఖకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్

image

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ శుక్రవారం నగరానికి రానున్నారు. రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయానికి ప్రత్యేక విమానంలో మద్యాహ్నం 12:20 గంటలకు విశాఖలో ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మద్యాహ్నం 12:50 గంటలకు విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలస్వా నౌకపై రక్షణ శాఖ మంత్రి దిగనున్నారు.

Similar News

News December 22, 2025

పోరాటానికి సిద్ధమైన విశాఖ ఉక్కు భూ నిర్వాసితులు

image

విశాఖ ఉక్కు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 4న పాత గాజువాకలో భారీ భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. సుమారు 8,500 మంది ఆర్-కార్డు దారులకు న్యాయం చేయాలని, మిగులు భూములను పంపిణీ చేయాలని నిర్వాసితుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. భూమి ఇచ్చే వరకు నెలకు రూ.25,000 భృతి చెల్లించాలని కోరుతూ 64 గ్రామాల నిర్వాసితులు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News December 22, 2025

విశాఖ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్

image

విశాఖ జిల్లా ప్రజలు ఇకపై భవనాలు, ఖాళీ స్థలాల సర్వే సర్టిఫికెట్ల కోసం జీవీఎంసీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కమిషనర్ వినూత్న ఆలోచనతో రూపొందించిన ఆన్‌లైన్ విధానాన్ని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ప్రారంభించారు. ​www.gvmc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ అవుతుంది.

News December 22, 2025

మా ఉద్యోగాలు అడ్డుకోవద్దు జగన్: విశాఖలో నిరుద్యోగుల ఆందోళన

image

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యువజన, నిరుద్యోగ సంఘాలు ఇవాళ ధర్నా చేపట్టాయి. టీసీఎస్, గూగుల్ వంటి ఐటీ సంస్థలపై వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని నేతలు మండిపడ్డారు. ‘మా జాబ్స్ అడ్డుకోవద్దు జగన్’ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించబోమని తలసముద్రం సూర్యం, గిరిధర్ తదితర నేతలు హెచ్చరించారు.