News December 7, 2024

నేడు విశాఖకు మంత్రి లోకేశ్ రాక

image

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖకు రానున్నారు. మధాహ్నం 2 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి రోడ్డు మార్గాన వెళ్తారు. ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో జరగనున్న ఏయూ పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనంలో పాల్గొంటారు.

Similar News

News October 24, 2025

ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన విశాఖ క‌లెక్ట‌ర్

image

చిన‌గ‌దిలిలో ఈవీఎం గోదాముల‌ను కలెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ త‌నిఖీ చేశారు. నెలవారీ త‌నిఖీల్లో భాగంగా శుక్రవారం ఉద‌యం గోదాముల‌ను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. సీసీ కెమెరాల ప‌నితీరును, ప్ర‌ధాన ద్వారానికి ఉన్న సీళ్ల‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై అక్క‌డ అధికారులకు, భ‌ద్ర‌తా సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు.

News October 24, 2025

‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందం రద్దు

image

సిరిపురంలోని ‘ది డెక్’ భవనంలో జార్జియా యూనివర్సిటీ అద్దె ఒప్పందాన్ని వీఎంఆర్డీఏ రద్దు చేసింది. నిర్దిష్ట సమయంలో డిపాజిట్ చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందం కుదిరిన 15 రోజుల్లోపు అడ్వాన్స్ డిపాజిట్ చెల్లించాలి. మూడు నెలలు గడిచినా డిపాజిట్ చెల్లించకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో మూడో ఫ్లోర్ ఖాళీగా ఉంది. దీనికోసం మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

News October 24, 2025

‘కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాలి’

image

కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సూపరింటెండెంట్ ఐ.వాణిని గురువారం కోరారు. 34 హెడ్ నర్సులు, 43 కాంట్రాక్ట్ నర్సులు, ట్రామా కేర్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సిబ్బంది పనిభారం అధికమై రోగుల సేవలో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.