News August 31, 2024

నేడు విశాఖ జిల్లాలోని పాఠశాలలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SHARE IT.

Similar News

News February 26, 2026

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో జీవీఎంసీ విజయం

image

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్ 2025-26లో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 630 నగరాలలో విశాఖపట్నం (GVMC) టాప్ 24 విజేతలలో ఒకటిగా నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు నగరానికి $1 మిలియన్ నిధులు లభించాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నిధితో ‘ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్’ ద్వారా వరదలు, తుపాన్లు, తీవ్రమైన ఎండల నుంచి నగరాన్ని రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.

News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌పై కలెక్టర్ సీరియస్(2/2)

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అవినీతి జిల్లా కలెక్టర్‌కే చిర్రెత్తు కొచ్చేలా చేస్తోంది. పీజీఆర్ఎస్‌లో ప్రతీవారం పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిచి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను పీక్కుతింటే సహించేది లేదని, పనిచేయకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వీళ్లలో కొంత మందికి ఇప్పటికే రెండు సార్లు మెమోలు కూడా అందడం గమనార్హం.

News February 26, 2026

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు(1/2)

image

విశాఖ నగరంలో భవన నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో GVMC టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు రూ. లక్షల్లో ముడుపులు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధనం ఉంటే వేగంగా, లేకపోతే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకుండా కొందరికి త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.