News August 31, 2024
నేడు విశాఖ జిల్లాలోని పాఠశాలలకు సెలవు
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్ హరీంధిర ప్రసాద్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SHARE IT.
Similar News
News September 14, 2024
విశాఖ: పలు అభివృద్ధి పనులకు స్థాయి సంఘం ఆమోదం
విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించినట్లు మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు. మేయర్ అధ్యక్షతన స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 250 అంశాలతో అజెండాను ప్రవేశ పెట్టగా 102 అంశాలకు ఆమోదం లభించిందని అన్నారు. సమయాభావం కారణంగా మిగిలిన అంశాలను వాయిదా వేసినట్లు తెలిపారు.
News September 13, 2024
విశాఖ: బ్లాస్ట్ ఫర్నేస్-3 ని మూసివేసిన అధికారులు
అతిపెద్ద కర్మాగారం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్ -3ని అధికారులు మూసివేశారు. బొగ్గు లేకపోవడం వల్ల దీనిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ -1 మూతపడింది. రూ8 వేల కోట్ల అప్పుల్లో స్టీల్ ప్లాంట్ మునిగిపోయినట్లు కార్మికులు తెలిపారు.
News September 13, 2024
వరద బాధితుల కోసం విశాఖ పోర్టు రూ.కోటి విరాళం
విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.