News January 18, 2025

నేడు విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు శనివారం విశాఖ నుంచి చర్లపల్లికి (08549/50)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. ఈరోజు సాయంత్రం విశాఖలో 7:45కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మీదుగా రేపు తెల్లవారి 7 గంటలకు చర్లపల్లి చేరుతుంది. 2nd AC, 3rd AC, స్లీపర్, జనరల్ ఉంటాయాన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News July 8, 2025

పరీక్షల నిర్వహణ పటిష్టంగా ఉండాలి: ఏయూ వీసీ

image

విద్యలో నాణ్యతను పెంచే దిశగా అనుబంధ కళాశాలలు పనిచేయాలని ఏయూ వీసీ జిపి రాజశేఖర్ అన్నారు. సోమవారం ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. పరీక్షలు నిర్వహణ పటిష్టంగా జరపాలని, లేకపోతే ఏయూ అనుబంధ కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొన్ని లోపాలు గుర్తించామని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News July 8, 2025

గిరి ప్రదక్షిణ భక్తులకు హెల్ప్ లైన్ నంబర్లు

image

జూలై 9న జరగబోయే గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. 32 కి.మీలు ప్రదక్షిణలో జీవీఎంసీ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని, భక్తులకు సమస్యలు ఎదురైతే జీవీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 0891-2507225, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009లకు కాల్ చేయాలన్నారు.

News July 8, 2025

సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు

image

సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు సిద్ధంగా వున్నాయి. RK బీచ్ నుంచి భీమిలి వరకు సైట్ సీయింగ్ కోసం పర్యాటక శాఖ ఈ బస్సులను త్వరలోనే ప్రవేశ పెట్టనుంది. బీచ్ అందాలను డబుల్ డెక్కర్ నుంచి వీక్షించడానికి వైజాగ్ వాసులు ఎదురు చూస్తున్నారు. పర్యాటకంగా విశాఖకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.