News March 23, 2025

నేడు విశాఖ రానున్న గవర్నర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం విశాఖ రానున్నారు. సాయంత్రం 8:55 విశాఖ ఎయిర్ పోర్ట్‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రుషి కొండ వద్ద ఉన్న ఓ హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. సోమవారం విశాఖలో ఉండి మంగళవారం సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు. వీటికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News March 30, 2025

విశాఖ: GVMC కార్పొరేటర్లకు గిఫ్టు కూపన్లు

image

GVMC బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం కార్పొరేటర్లకు రూ. 25వేల విలువైన గిఫ్టు కూపన్లను అందజేశారు. GVMC లో సభ్యులైన MLA, MLC, MP లకు గిఫ్టు కూపన్లు అందించినట్లు సీపీఐ నాయకులు తెలిపారు. వీటి కోసం సుమారు రూ.30 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. సీపీఐ కార్పొరేటర్ స్టాలిన్, సీపీఎం కార్పొరేటర్ గంగారావు వీటిని తిరస్కరించారు. ప్రజల సొమ్మును గిఫ్టులుగా ఖర్చు చేయడం సరైనది కాదని వారు ఆరోపించారు.

News March 30, 2025

విశాఖ: 9 మంది పోలీస్ సిబ్బందికి వీడ్కోలు పలికిన సీపీ

image

విశాఖ నగర పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన 9 మంది పోలీస్ సిబ్బంది శనివారం పదవీ విరమణ చేశారు. వారికి విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖలో 40 ఏళ్ళకు పైగా సర్వీస్ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. రిటైర్మెంట్ జీవితం హాయిగా గడపాలని కోరారు. రిటైర్డ్ అయిన వారిలో ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సి, ఎఆర్‌హెచ్‌సీ, పీసీలు ఉన్నారు.

News March 29, 2025

విశాఖ: టీడీపీ జిల్లా కార్యాలయంలో వేడుకలు 

image

విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా నిర్విరామంగా ప్రజల కష్టాలను తీరుస్తూ, దేశ రాజకీయ చరిత్రలోనే టీడీపీ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే లు గంటా శ్రీనివాస్‌రావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గండి బాబ్జి ఉన్నారు.

error: Content is protected !!