News October 21, 2024
నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం విశాఖ రానున్నారు. ఉదయం 9.30గంటలకు విమానాశ్రయానికి చేరుకుని, ఇక్కడి నుంచి 9.35 గంటలకు రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి సాయంత్రం 4.10గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి 4.15గంటల విమానంలో విజయవాడ బయలుదేరి వెళతారు.
Similar News
News July 5, 2025
విశాఖలో టాస్క్‌ఫోర్స్‌కు అదనపు సిబ్బంది

విశాఖలో టాస్క్ ఫోర్స్ బలోపేతం చేసేలా పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐల పర్యవేక్షణలో టాస్క్ ముమ్మరంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తూ మరో ఏడుగురి సిబ్బందిని నియమించారు. భీమిలి ఎస్ఐ హరీశ్‌తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, మరో ఐదుగురు కానిస్టేబుళ్లను టాస్క్‌ఫోర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News July 5, 2025
విశాఖ: A.P.E.P.D.C.L. పరిధిలో C.G.R.F సదస్సులు

ఈనెల 8 నుండి A.P.E.P.D.C.L. పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (C.G.R.F) సదస్సులు నిర్వహిస్తామని ఛైర్మన్ బి.సత్యనారాయణ తెలిపారు. సంస్థ సెక్షన్ కార్యాలయాల్లో సదస్సులు జరుగుతాయన్నారు. విద్యుత్ వినియోగదారులు నేరుగా సదస్సుల్లో పాల్గొని ఫిర్యాదులు ఇవ్వాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లులు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.
News July 5, 2025
సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. గిరిప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు వైద్య శిబిరాల గురించి చర్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విన్నవించారు.