News September 24, 2024
నేడు విశాఖ రానున్న మంత్రి లోకేశ్

రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం రాత్రి విశాఖ రానున్నారు. రాత్రి 9.30 గంటలకు ఆయన నగరానికి చేరుకుంటారు. బుధవారం ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులతో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించే సమావేశంలో లోకేశ్ పాల్గొంటారు. అనంతరం రుషికొండ ఐటీ పార్కును సందర్శించి అక్కడ ఉద్యోగులు, నిపుణులతో భేటీ అవుతారు. అదే రోజు రాత్రి తిరిగి బయలుదేరి విజయవాడ వెళతారు.
Similar News
News September 18, 2025
విశాఖలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్

విశాఖలో బుధవారం రాత్రి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. వన్ టౌన్, కంచరపాలెం, షీలా నగర్ ప్రాంతాల్లో ఒకే బ్యాచ్ ఏడు చైన్ స్నాచింగ్లు చేసి కలకలం సృష్టించింది. ఒకే బైక్ పై ఇద్దరు యువకులు ఈ ఏడు చోట్ల చోరీలు చేసినట్లు సమాచారం. దొంగతనం చేసిన బైక్తో స్నాచింగ్కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 చోట్ల జరిగిన స్నాచింగ్లో సుమారు 20 తులాల వరకు బంగారు ఉంటుందని చెబుతున్నారు.
News September 18, 2025
సొంత నియోజకవర్గంలోనే పల్లాకు తలనొప్పి

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై TDP రాష్ట్ర అధ్యక్షుడు P.శ్రీనివాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధినేతగా రాష్ట్రవ్యాప్తంగా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నా.. సొంత నియోజకవర్గంలో మాత్రం ప్లాంట్ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు TDP కూడా కారణమని కార్మిక సంఘాల ఆరోపణలు, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఏమైయ్యాయి? అని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తుండడంతో పల్లాకు మరింత ఇబ్బందిగా మారింది.
News September 18, 2025
నేనూ బాధితుడినే: MLA విష్ణుకుమార్ రాజు

AP టిడ్కో గృహాల సమస్యలపై విశాఖ MLA విష్ణుకుమార్ రాజు గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. బెనిఫిషరీస్ టిడ్కో ఇండ్లలో దిగి రెండేళ్లు అవుతున్నా.. కాంట్రాక్టర్లకు మాత్రం ఇంత వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. తాను కూడా ఒక బాధితుడినే అన్నారు. తన కంపెనీకి రావాల్సిన రూ.123 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జగన్ ప్యాలెస్ కట్టిన వారికి మాత్రం రూ.60 కోట్లను ఆర్ధిక శాఖ రిలీజ్ చేసిందన్నారు.