News January 26, 2025
నేడు విశాఖ రానున్న మంత్రి లోకేశ్

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ రానున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరంలో గల టీడీపీ కార్యాలయానికి వెళ్తారు . అక్కడ ముఖ్య నాయకులతో మాట్లాడుతారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం జిల్లా కోర్ట్కు హాజరు అవుతారు. అనంతరం విజయవాడ తిరిగి పయణమవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 12, 2025
ఐటీ హిల్స్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంగణంలో కాగ్నిజెంట్ కంపెనీ శాశ్వత భవనాల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు నగర ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
News December 12, 2025
విశాఖలో టెక్ తమ్మిన సంస్థకు మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖ మధురవాడలోని హిల్ నెంబర్-2లో టెక్ తమ్మిన ఐటీ సంస్థ క్యాంపస్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శుక్రవారం భూమిపూజ చేశారు. టెక్ తమ్మిన సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 500 మందిగి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్,దుబాయ్,ఇండియాలో తన సేవలను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఈవో రాజ్ తమ్మిన,ఎంపీ భరత్ ఉన్నారు.
News December 12, 2025
పూర్వ విద్యార్థుల సమావేశానికి సిద్ధమవుతున్న AU

ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్షిక పూర్వ విద్యార్థుల సమావేశం 2025కు సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వేదికగా కార్యక్రమం జరగనుంది. శతాబ్ది సంవత్సరంలో జరుగుతున్న ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. సంఘం వ్యవస్థాపక చైర్మన్ జి.ఎం రావు తదితరులు పాల్గొంటారు. వర్సిటీ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.


