News March 30, 2025

నేడు విశాఖ రానున్న మంత్రి నారా లోకేశ్

image

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆదివారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.  అక్కడి నుంచి రోడ్డు మార్గాన IPL మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం రామ్‌నగర్‌లో గల ఎన్టీఆర్ భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. వీటికి తగ్గట్టు పార్టీ వర్గాలు ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News December 19, 2025

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర (SASA) ప‌క్కాగా నిర్వ‌హించాలి: విశాఖ కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాల‌ను ప‌క్కాగా నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 3వ శనివారం విశాఖలో ‘పర్యావరణంలో అవకాశాలు’ అంశంపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాల‌ని సూచించారు. స్వయం సహాయక సంఘాలు (SHGలు), స్టార్టప్‌లు, స్థానిక వ్యాపారులు అభివృద్ధి చేసిన రీసైకిల్, అప్‌సైకిల్, పర్యావరణహిత ఉత్పత్తులను ప్రదర్శించాల‌న్నారు.

News December 19, 2025

బురుజుపేట: కనకమహాలక్ష్మి అమ్మవారికి సారె సమర్పణ

image

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో అఖరి రోజు కావడంతో శుక్రవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో శోభారాణి అని ఏర్పాట్లు చేశారు. ఆలయావరణంలో ప్రత్యేక ప్రసాదం కౌంటర్లను అందుబాటులో ఉంచారు.

News December 19, 2025

విశాఖలో కిలో బీన్స్ పిక్కలు రూ.125

image

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.28, బంగాళదుంప రూ.13, వంకాయ రూ.42, బెండ రూ.54, మిర్చి రూ.44, బీరకాయ రూ.62, కాలిఫ్లవర్ రూ.26, కాకరకాయ రూ.60, చిలకడ దుంప రూ.34, దొండకాయ రూ.42, క్యారెట్ రూ.38, చిక్కుడుకాయ రూ.60, బీట్రూట్ రూ.34, పెన్సిల్ బీన్స్ రూ.50, బీన్స్ పిక్కలు రూ. 125, పొటల్స్ రూ.54, క్యాప్సికం రూ.44గా ఉన్నాయి.