News April 28, 2024

నేడు వెంకటగిరికి సీఎం జగన్ 

image

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం వెంకటగిరిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో దిగుతారు. 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు వెంకటగిరిలోని త్రిభువని సెంటరులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ లో కందుకూరు బయలుదేరుతారు.

Similar News

News April 14, 2026

నెల్లూరు: బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం.!

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

News April 14, 2026

అట్రాసిటీ బాధితురాలికి సర్కారు కొలువు!

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

News April 13, 2026

కొడవలూరు: రైలు కిందపడి మహిళ మృతి

image

పడుగుపాడు- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య సుమారు 40-45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మరణించింది. మహిళ పచ్చని చీరపై వంగపూత రంగు చుక్కలు, అంచు కలదు. ఎర్రని జాకెట్, నల్లని లంగా ధరించి ఉంది. మేడలో పూసలతో కూడిన పసుపు దారం, కుడి చేతిపై •> గుర్తు గల పచ్చ బొట్టు ఉంది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.