News November 23, 2024
నేడు శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశం

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఉదయం నిర్వహించనున్నట్లు CEO ఎల్.ఎన్.వి శ్రీధర్ రాజా ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పిరియా విజయ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని స్పష్టం చేశారు.
Similar News
News November 18, 2025
గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఎచ్చెర్ల: నన్ను కాపాడండి సార్.. చిన్నారి వేడుకోలు..!

ఎచ్చెర్లలోని ముద్దాడకు చెందిన ఐదేళ్ల సింధు నందన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే ఆ చికిత్సకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తమ ఆర్థిత స్థోమత సరిగాలేదని ప్రభుత్వం ఆదుకుని తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.