News October 24, 2024
నేడు శ్రీవారి రూ.300 టికెట్ల విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి నెలకు సంబంధించి రూ.300 టికెట్ల కోటాను నేడు విడుదల చేయనున్నట్లు TTD అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ ద్వారా టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News November 4, 2024
దివ్యాంగులు పెట్రోల్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోండి
చిత్తూరు జిల్లాలోని దివ్యాంగుల మూడు చక్రాల వాహనాలకు సబ్సిడీ పెట్రోల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు ఏ.వై శ్రీనివాసులు కోరారు. గుర్తింపు కలిగిన ప్రైవేటు సంస్థలలో పనిచేస్తూ సొంత మూడు చక్రాల మోటారు వాహనాలు గల దివ్యాంగుల నుంచి పెట్రోల్, డీజిల్ రాయితీ కోసం ఈనెల నవంబర్ 15 లోగా దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు జతపరచాలన్నారు.
News November 4, 2024
రెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం
శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు వారాంతాల్లో టీటీడీ పెద్ద పీఠ వేస్తోంది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది.
News November 4, 2024
రేపు చిత్తూరులో జాబ్ మేళా
చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 18-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన యువతి యువకులు అర్హులన్నారు.