News February 10, 2025
నేడు శ్రీశైలానికి మంత్రుల బృందం

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రుల బృందం క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.
Similar News
News March 17, 2025
తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండాలి: కర్నూలు కలెక్టర్

తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కలిసి ఉండాలని, ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరువలేనిదని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతిని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రంలో చిల్డ్రన్స్ పార్క్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.
News March 17, 2025
రాజమండ్రి: రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ నిర్వహణ

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్, డివిజన్, మండల కేంద్రం, మున్సిపల్ కార్పొరేషన్, పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరిధిలోని సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు.
News March 17, 2025
ఒకే రోజు 46 వివాహాలకు హాజరైన ఎర్రబెల్లి

ఓకే రోజు 46 వివాహాలకు హాజరై ఎర్రబెల్లి దయాకర్ రావు రికార్డు సృష్టించారు. సాధారణంగా నాయకులు అంటే ఒకటి, రెండు వివాహాలకు హాజరవుతారు కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం ఒక్క రోజే దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర, వర్ధన్నపేట మండలాల్లో పర్యటించి 46 నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులకు సంతోషకరమైన వైవాహిక జీవితం కోరుతూ వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలన్నారు.