News January 3, 2025

నేడు సంగారెడ్డిలో మంత్రి పర్యటన

image

సంగారెడ్డిలో నేడు మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో అమృత్ 2.0 కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, సమాఖ్య పెట్రోల్ పంపుకు శంకుస్థాపన, మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేసి 108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తారు. జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించున్నారు.

Similar News

News January 8, 2025

పటాన్‌చెరు: బైక్‌లో చున్నీ ఇరుక్కొని మహిళ మృతి

image

బైక్‌లో చున్నీ చిక్కుకొని మహిళ మృతి చెందిన ఘటన అమీన్‌పూర్‌లో నిన్న జరిగింది. పటాన్‌చెరు డివిజన్‌లోని జీపీ కాలనీకి చెందిన నవదీప్ దూలపల్లిలో MCA చేస్తున్నాడు. కాలేజీలో పేరెంట్స్ మీటింగ్‌కు తల్లి రజితను బైక్‌పై తీసుకెళ్తుండగా ఆమె చున్ని బైక్ టైరులో చిక్కుకొని కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదైనట్లు SI దుర్గయ్య తెలిపారు.

News January 8, 2025

మెదక్: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

image

సంక్రాంతి సందర్భంగా మెదక్ రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 10, నుంచి 18 వరకు (14, 15 మినహా) 280 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు ప్లాన్ చేశారు. కాగా సంక్రాంతి స్పెషల్ సర్వీసుల్లో అదనందగా 50 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈ సర్వీసుల్లో ‘మహాలక్ష్మి’ వర్తింపుపై క్లారిటీ రావాల్సి ఉంది.

News January 8, 2025

మెదక్: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించాలి: మంత్రి

image

ఆలోచనలతోనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని, వీటిని గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతో పాటు గురువులేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సేజ్‌లోని ఒ ప్రైవేట్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మోహన్ రావు, విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ఉన్నారు.