News March 10, 2025

నేడు సత్యసాయి జిల్లాలో ప్రజా పరిష్కార వేదిక.!

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టీఎస్ ఛైర్మన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల ముఖ్య అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చునన్నారు.

Similar News

News October 30, 2025

నలభైల్లో జీవితంపై ఓ స్పష్టత.. మీరేమంటారు?

image

ఏ వ్యక్తికైనా నలభైల్లో జీవితంపై ఓ స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వయసులో మానసిక రోగాలు, వ్యసనాలు దాదాపు కుదుటపడతాయి. వైవాహిక జీవితంలో భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. ఆస్తి, అప్పులు సర్దుబాటు అవుతాయి. కొత్త స్నేహాలు, అక్రమ సంబంధాల ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయాలు, బంధుత్వాలు, శత్రువులు వంటి విషయాలపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. వ్యక్తిగత లక్ష్యాల కంటే కుటుంబ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు.

News October 30, 2025

పంట నష్టం నివేధికను తయారు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో తుపాను ప్రభావం వల్ల పంట నష్టాల నివేధికను తయారు చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాల్‌లో ఆయన మాట్లాడారు. తుపాను ప్రభావంవల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనాలు, కృష్ణా నది, నల్లమడ కాలువలు ప్రవాహం ఎక్కువగా ఉన్నందున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జిల్లాలో తుపాను ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయాలన్నారు.

News October 30, 2025

పెద్దన్నవారిపల్లికి సీఎం చంద్రబాబు రాక

image

సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. నవంబర్ 1న తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ సతీశ్ కుమార్ హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.