News March 30, 2025
నేడు సన్నబియ్యం పథకం ప్రారంభం.. ఫస్ట్ వీరికే!

రాష్ట్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్నగర్ వేదికగా CM రేవంత్ ప్రారంభించనున్నారు. మొదటగా పట్టణంలోని రేషన్ కార్డుదారులు ధరావత్ బుజ్జీ, కర్ల రాధ, పైలా రజిత, సుశీల, షేక్ కరీమా, మమత, చల్లా సుగుణ, కర్నా వెంకటపుష్ప, సరికొండ ఉమ, మండల పరిధిలోని చడపండు లక్ష్మి, భరతం కుమారి, కర్పూరపు లక్ష్మి, మాళోతు రంగా, గుండెబోయిన గురవయ్య, షేక్ రహిమాన్కు CM రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.
Similar News
News October 17, 2025
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు: ఎస్పీ

పోలీసు సిబ్బంది శాఖాపరమైన సమస్యల పరిష్కారం కోసం ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సిబ్బంది నుంచి వినతులను స్వీకరించిన ఆయన, వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమం ముఖ్యమని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
News October 17, 2025
అనుమతులు రాగానే అందుబాటులోకి ఇసుకరీచ్: కలెక్టర్

కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో 24,900 హెక్టార్లలో 3,73,500 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ కొరకు SEACకి నివేదికలు పంపినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. వారి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే జువ్వలపాలెం ఇసుకరీచ్ అందుబాటులోకి వస్తుందని మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. ప్రతి ఇసుక రీచ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి కలెక్టర్ అధికారులను ఆరా తీశారు.
News October 17, 2025
తల్లిపాలు పెంచే ఫుడ్స్ ఇవే..

మొదటిసారి తల్లైన తర్వాత మహిళలకు ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. వాటిల్లో ఒకటే తగినంత పాలు ఉత్పత్తికాకపోవడం. ఇలాంటప్పుడు కొన్ని ఆహారాలను డైట్లో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. పాలకూర, మెంతికూర, బ్రకోలీ, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, ఓట్స్, నువ్వులు, మెంతులు తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు. అలాగే వ్యాయామాలు, ధ్యానం చేయడం కూడా మంచిదని సూచిస్తున్నారు.