News November 26, 2024
నేడు సరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి మొక్కుల రూపంలో సమర్పించిన హుండీ కానుకలను నేడు ఆలయ ప్రాంగణంలో లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వణాధికారి విజయ రామారావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు, పోలీసు, బ్యాంకు సిబ్బంది, స్వచ్ఛంద సేవా సమితి భక్తులు పాల్గొననున్నారు.
Similar News
News December 10, 2024
నిర్మల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి సూసైడ్
నిర్మల్‌కు చెందిన ఓ ఉద్యోగి భరత్ సోమవారం ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కాగా చనిపోయే ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ‘2018లో ఆరోగ్య శాఖలో RNTCP కాంట్రాక్ట్ ఉద్యోగం పొందాను. నాకంటే కింది స్థాయి వారికి ఎక్కువ జీతం రావడం.. నేను పర్మినెంట్ కాకుండా ఉంటానేమోనని మనస్తాపానికి గురై చనిపోతున్నా. నాభార్య పల్లవికి అన్యాయం చేస్తున్నా. కుమారుడు దేవాను వీడిపోతున్నా, అమ్మనాన్న సారీ’ అంటూ నోట్ రాశాడు.
News December 10, 2024
నిర్మల్: తండ్రిని కొట్టి, ఉరేసి చంపిన కొడుకు
తండ్రిని కొడుకు చంపిన ఘటన నిర్మల్‌లో జరిగింది. SI లింబాద్రి వివరాల ప్రకారం.. ముఠాపూర్‌కు చెందిన ముత్యం(47) ఆదివారం రాత్రి తన తల్లిని మద్యం కోసం డబ్బులివ్వాలని కొట్టాడు. అప్పుడే ఇంటికి వచ్చిన ముత్యం కొడుకు మణిదీప్ నానమ్మను కొట్టాడనే కోపంతో తండ్రిని చితకబాదాడు. కోపం తగ్గకపోవడంతో చీరతో ఉరేసి చంపాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వృద్ధురాలిని ఆరాతీయడంతో విషయం బయటపడినట్లు SI వెల్లడించారు.
News December 10, 2024
ఆదిలాబాద్: ‘ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి’
భీంపూర్ మండలం వడూర్ గ్రామ సమీపంలో ఉన్న పెన్ గంగా నది తీరంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వడూర్ గ్రామస్థులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. పెనుగంగా నుంచి జేసీబీలతో లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు నింపుకొని గ్రామం నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనీ పేర్కొన్నారు. దీని వలన రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.