News August 16, 2024

నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

image

కాళేశ్వర క్షేత్రంలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలోని కల్యాణ మండపం వద్ద ఉదయం 10.30 గంటలకు అర్చకుల వేదమంత్రాల నడుమ వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మారుతి తెలిపారు. మహిళలకు ఆలయం తరఫున పూజా సామగ్రి ఆందజేయనున్నట్లు చెప్పారు. వ్రతాల నిర్వహణ అనంతరం మహిళలకు ప్రత్యేక ప్రసాదాలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

మూడు విడతలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని గఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకు కోడ్ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 5, 2025

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

image

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.