News January 26, 2025
నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు..

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలో ఉ.7:30 నుంచి ఉ.11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
Similar News
News November 10, 2025
జూబ్లీ బైపోల్: BRS నాయకత్వానికి KCR కీలక ఆదేశాలు

జూబ్లీ బైపోల్‌కు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా BRS అధ్యక్షుడు KCR ఈ రోజు సాయంత్రం KTR, హరీశ్ రావు, కొంతమంది ముఖ్యమైన BRS నాయకులతో సమావేశం కానున్నారు. రేపు పోల్ మేనేజ్మెంట్ కీలకమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓట్ల కోసం అధికారం, డబ్బును ఉపయోగించుకుంటుందని హెచ్చరించారు. పోలింగ్ స్థితిని పర్యవేక్షించడానికి కొన్ని ముఖ్యమైన పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక BRS బృందాలను మోహరించనున్నట్లు సమాచారం.
News November 10, 2025
జూబ్లీహిల్స్‌ను ‘వదలని’ Non-Locals!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది ‘స్థానికేతరులు’ (non-locals) హోటళ్లు, ప్రైవేట్ ఇళ్లలో మకాం వేశారని సమాచారం. ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం వీరు పోలింగ్‌కు ముందు నియోజకవర్గం విడిచివెళ్లాలి. అయితే, వీరిని గుర్తించి పంపించడం అధికారులకు సవాల్‌గా మారింది.
News November 10, 2025
జూబ్లీహిల్స్‌లో మీ ఓటు ఆదర్శం అవ్వాలి!

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా.. రేపు మన వంతు అని గుర్తు పెట్టుకోండి. నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు నిన్నటితో ముగిశాయి. రేపు మన అమూల్యమైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. 4,01,365 మంది ఓటర్లలో మనం ఒక భాగం అని మర్చిపోకండి. MLAను ఎన్నుకునే బాధ్యత మనపైనే ఉంది. జూబ్లీహిల్స్‌కు 3 సార్లు ఎన్నిక జరిగినా సగం మంది ఓటెయ్యలేదు. ఈ బైపోల్లో మీరు వేసే ఓటు ఇతరులకు ఆదర్శం కావాలి. అందరూ ఓటెయ్యాలి.!


