News February 22, 2025
నేడు సిద్దిపేటకు కీలక నేతల రాక..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల సత్తా చాటుతామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షులు ఇమామ్ అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. సిద్ధిపేటలోని ఓ గార్డెన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శనివారం సభ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అసెంబ్లీ కోఆర్డినేటర్ అద్దంకి దయాకర్ హాజరవుతారని తెలిపారు.
Similar News
News November 7, 2025
ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.
News November 7, 2025
భారత రైతాంగ ఉద్యమపితామహుడు మన జిల్లావారే

రైతు జన బాంధవుడు ఆచార్య ఎన్.జీ.రంగా పొన్నూరులోని నిడుబ్రోలులో 1900 నవంబర్ 7న జన్మించారు. ఇంగ్లాండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు. మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1934లో రైతు ప్రతినిధిగా పార్లమెంటులో అడుగు పెట్టి 1991వరకు ఉభయ సభల్లో కొనసాగి, గిన్నిస్ బుక్ ఎక్కారు. నిడుబ్రోలులో రామినీడు రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి ఎందరో రాజకీయ నాయకులను అందించారు.
News November 7, 2025
చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్‌పూర్‌లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.


