News March 13, 2025
నేడు సిరిసిల్ల కలెక్టరేట్లో జాబ్ మేళా

సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీ వైఎస్కే ఇన్ఫోటెక్లో ఉద్యోగాలు కల్పించడానికి నేడు కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి నీల రాఘవేంద్ర తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నేడు ఉదయం 11 గంటలకు సంబంధిత పత్రాలు జిరాక్సులతో హాజరవ్వాలని సూచించారు. మరిన్ని వివరాలకు 70935 14418, 90003 85863 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 10, 2025
ఏపీ టుడే

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.
News November 10, 2025
వరంగల్ ప్రజలు ఈ వారం జాగ్రత్త

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 నుంచి వారం రోజులపాటు చలి పంజా విసరనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 11 నుండి 19 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో 11 నుంచి14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు, మహబూబాబాద్ జిల్లాలో 14 నుంచి 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. వృద్దులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
News November 10, 2025
ప్రేమకు చిహ్నం: కుమారుడికి గుడి కట్టించి.. పూజలు

భద్రాద్రి కొత్తగూడెం(D) పాల్వంచ(M) కొత్త సూరారం గ్రామంలో కన్న కొడుకు అకాల మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు, అతని జ్ఞాపకార్థం గుడి కట్టించారు. గ్రామానికి చెందిన జక్కుల శేఖర్-నాగలక్ష్మి దంపతుల కుమారుడు సంపత్ కుమార్ గత ఏడాది కిన్నెరసాని వాగులో ప్రమాదవశాత్తు మరణించాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు సంపత్ కుమార్ విగ్రహాన్ని తయారు చేయించి, నిత్యం పూజలు చేస్తూ తమ ప్రేమను చూపుతున్నారు.


