News July 30, 2024

నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే!

image

సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 12 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం సచివాలయంలో గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖలపై చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష చేస్తారు.

Similar News

News November 14, 2025

బాల్య వివాహాలపై సమాచారం ఉంటే 1098‌కి ఫిర్యాదు చేయాలి: కలెక్టర్

image

బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి సేవలు అధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బాలల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం సర్వేవల్, పార్టిసిపెంట్, డెవలప్మెంట్, ప్రొటెక్షన్ హక్కులను కల్పించిదని అని తెలిపారు.

News November 14, 2025

పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి: కలెక్టర్

image

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలు ఏర్పాటుకు అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖలు నిర్దేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలన్నారు.

News November 14, 2025

GNT: ‘నెలాఖరు లోపు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలి’

image

స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెలాఖరులోపు పొందాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను సెప్టెంబరు 1 నుంచి సచివాలయాల సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 5,36,406 కార్డుదారులకు పంపిణీ పూర్తి అయిందన్నారు. 49,209 కార్డులు పంపిణీ కాకుండా సచివాలయాల వద్ద మిగిలి ఉన్నాయని, లబ్ధిదారులు కార్డులు తీసుకోవాలన్నారు