News April 30, 2024

నేడు సీఎం జగన్ కడప జిల్లా పర్యటన వివరాలు

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మైదుకూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన పర్యటన వివరాలను వెల్లడించారు. ఉ. 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.45కు ప్రకాశం జిల్లా టంగుటూరు చేరుకొని బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి 12.45కి మైదుకూరుకు హెలికాప్టర్లో రానున్నారు. 12.55గం.కు సభాస్థలికి చేరుకుని 1.10-1.55 గంటల వరకు కొనసాగించనున్నారు. 2.10గం.కు అన్నమయ్య జిల్లాకు బయలుదేరుతారు.

Similar News

News November 24, 2025

విజేతలుగా కడప జిల్లా టీంలు

image

పులివెందలలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్‌లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్‌గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతే గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.

News November 24, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
☞ బంగారం 24 క్యారెట్ 1 గ్రాము రూ.12,440
☞ బంగారం 22 క్యారెట్ 1 గ్రాము రూ.11,445
☞ వెండి 10 గ్రాములు రూ.1,577.

News November 24, 2025

ప్రొద్దుటూరులో అంతా జీరో వ్యాపారమే..?

image

ప్రొద్దుటూరులో జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఇక్కడ ఫైనాన్స్, బంగారం, హవాలా, సినిమా, రియల్ ఎస్టేట్, ఎలక్షన్స్‌లో ఇక్కడి వ్యాపారులు రూ.వేల కోట్లు పెట్టుబడులు, రుణాలు ఇస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇదంతా ప్రభుత్వ అనుమతులు, పన్నులు లేకుండానే సాగుతున్నట్లు సమాచారం. వ్యాపారి శ్రీనివాసులుపై జీరోలో అభరణాలు, స్కీములు, చీటీల వ్యాపారంపై ఇప్పుడు ఫిర్యాదులు వచ్చాయి.