News May 4, 2024

నేడు సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన వివరాలు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నేడు మరోసారి జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వీఆర్సీ క్రీడా మైదానానికి చేరుకోనున్నారు. అనంతరం 3.10 నిమిషాలకు ఆయన రోడ్ షోలో పాల్గొంటారు. 3.30 గంటలకు ఆయన నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Similar News

News November 9, 2024

నెల్లూరు జిల్లాలో ఉచితంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు APSPDCL జిల్లా సర్కిల్ SE విజయ్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లకు వినియోగదారులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదన్నారు. ఇప్పటికే 8 వేల స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామన్నారు. కచ్చితమైన విద్యుత్ రీడింగ్ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

News November 9, 2024

నెల్లూరు: స్కూళ్లకు నేటి సెలవు రద్దు

image

సాధారణంగా రెండో శనివారం(second satur day) సెలవు ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లాలో నేడు అన్ని స్కూళ్లకు సెలవు రద్దు చేశారు. అన్ని స్కూళ్లు నేడు యథావిధిగా నడుస్తాయి. ఇటీవల భారీ వర్షాలకు వరుస సెలవులు ప్రకటించారు. ఈక్రమంలో నేటి సెలవును వర్కింగ్ డేగా మార్చారు. మరోవైపు తిరుపతి జిల్లాలోని పాఠశాలలకు సైతం హాలీ డే రద్దు చేశారు.

News November 8, 2024

నెల్లూరు జిల్లాలో అసాంఘీక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం: ఎస్పీ

image

నెల్లూరు జిల్లాలో అసాంఘీక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా సిబ్బంది కృషి చేస్తున్నారని ఎస్పీ జీ.కృష్ణ కాంత్ తెలిపారు. నగరంలోని నవాబ్ పేట పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో 35 మంది సిబ్బందితో 400 ఇల్లు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, దొంగతనాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.