News February 3, 2025
నేడు హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. టీడీపీ నుంచి రమేశ్ కుమార్, వైసీపీ నుంచి లక్ష్మీ మహేశ్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి చేరిన వారు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీకి 23 మంది సభ్యులు ఉండటంతో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. పట్టణంలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే బాలయ్య ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు.
Similar News
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.
News October 27, 2025
అల్లూరి: తుఫాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం

మొంథా తుఫానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అప్రమత్తంగా ఉన్నామన్నారు. రేపు తుఫాన్ కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలన్నారు.
News October 27, 2025
GWL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పొరపాట్లు ఉండరాదు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పొరపాటు లేకుండా గడువులోగా పూర్తి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. 2002 ఎన్నికల జాబితాను ప్రామాణికంగా తీసుకొని 2025 జాబితాతో నియోజకవర్గాల వారిగా మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. 2002 జాబితాలో ఉన్న వారిని A, లేనివారిని B, 22- 37 మధ్య వయస్సులను C, 18- 21 మధ్య వారిని D కేటగిరీలుగా విభజించామన్నారు.


