News February 3, 2025
నేడు హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక

హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. టీడీపీ నుంచి రమేశ్ కుమార్, వైసీపీ నుంచి లక్ష్మీ మహేశ్ బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి చేరిన వారు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి టీడీపీకి 23 మంది సభ్యులు ఉండటంతో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. పట్టణంలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే బాలయ్య ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు.
Similar News
News February 13, 2025
చీమకుర్తి: ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ

ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చీమకుర్తి నందు గల జిల్లా ఫైరింగ్ రేంజ్‌లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌ను గురువారం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ సందర్శించి అక్కడ చేస్తున్న ఫైరింగ్ ప్రక్రియ గురించి అధికారులకు పలు సూచనలు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారులలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు.
News February 13, 2025
చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
News February 13, 2025
ఆలూర్‌లో కుంటలో పడి వ్యక్తి మృతి

ఆలూర్ వెంకటేశ్వర గుట్ట వద్ద తవ్విన కుంటలో ముత్తేన్న అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక మద్యానికి అలవాటు పడి కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం ఏడు గంటలకు కుంటలో ఆయన మృతదేహం బయటపడింది.