News November 16, 2024

నేడు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

image

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రకటిస్తారని మంత్రి క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 9 గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని తిరుమల గార్డెన్స్‌లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

Similar News

News December 11, 2024

KNR: గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు.

News December 11, 2024

సిరిసిల్ల: ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు: ఎస్పీ

image

సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టెన్త్ సర్టిఫికెట్‌తో ఈనెల 12  నుంచి 15 వరకు వారి పరిధి పోలీస్ స్టేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

News December 11, 2024

ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో రైతు మృతి

image

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రైతు చిందు శంకర్ (50) వ్యవసాయ పొలం వద్ద పనులు చేసి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. శంకర్‌‌కు భార్య పద్మ, కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్, కుమార్తె ఉన్నారు.