News November 23, 2024

నేడు హైదరాబాద్‌కు బైరి నరేశ్

image

మూఢ నమ్మకాల నిర్మూలన సమితి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు అంబేడ్కర్ రిసోర్స్ సెంటర్లో కులాంతర వివాహ జంటల అభినందన, సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జాతీయ అధ్యక్షుడు బైరి నరేశ్ తెలిపారు. ముఖ్య అతిథులుగా గద్దర్ కూతురు, సాంస్కృతిక సారథి ఛైర్‌పర్సన్ వెన్నెల, అంబేడ్కరిస్ట్ కేకే రాజా, పసునూరి రవీందర్, స్కైలాబ్, జర్నలిస్టు రాకేశ్, రెలారే గంగ హాజరవుతారని ఆయన తెలిపారు.

Similar News

News November 23, 2024

జూబ్లీహిల్స్: శివలింగం నుదుటిపై సింధూరమైన సూర్యకిరణాలు

image

జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ సన్నిధిలో అద్భుతం చోటు చేసుకుంది. శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివలింగం నుదుటిపై సింధూరంలా కనిపించాయి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడి.. సింధూరంలో కనిపించిందని రామంజి గురుస్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారన్నారు.

News November 23, 2024

జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్

image

సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.

News November 23, 2024

HYD: మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారా?: సాయి

image

అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్‌రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.