News August 24, 2024
నేడు హౌరా-ఎర్నాకులం ట్రైన్ రీ షెడ్యూల్
శనివారం హౌరాలో బయలుదేరే రైలు (22877) హౌరా-ఎర్నాకులం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ 4:10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరనుంది. మధ్యాహ్నం 14:50 గంటలకు బదులుగా 19:00 గంటలకు హౌరాలోని బయలుదేరుతుంది. భువనేశ్వర్, విజయనగరం మీదుగా దువ్వాడ స్టేషన్‌కు రేపు ఉదయం 9:05 చేరనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
Similar News
News September 14, 2024
విశాఖ: 24 నుంచి ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలు
ఇంటర్ రైల్వే బాక్సింగ్ పోటీలను ఈనెల 24 నుంచి 27 వరకు విశాఖలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు వాల్తేరు డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 78వ పురుషులు, మహిళల 17వ ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ప్రముఖ బాక్సర్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.
News September 14, 2024
సీఎం నివాసం వద్ద విశాఖ జిల్లా మహిళ ఆవేదన
విశాఖ జిల్లాలోని భీమిలికి చెందిన వైసీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందని భీమిలికి చెందిన వెంకటలక్ష్మి శుక్రవారం మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. అతని వద్ద 2021నుంచి చిట్టీలు కడుతున్నానని, ఇటీవల చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తమకు సీఎం చంద్రబాబు, లోకేశ్‌లే న్యాయం చేయాలని ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
News September 14, 2024
విశాఖ: ఓటరు జాబితా సవరణ.. నిధులు విడుదల
విశాఖ జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ-2025 కార్యక్రమానికి సంబంధించి ఖర్చుల కోసం రూ.17,85,820 నిధులు విడుదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం ఈ మేరకు నిధులు విడుదల చేశారు. మెటీరియల్ కొనుగోలు చేయడంతో పాటు ఇతర అవసరాల కోసం వీటిని వాడాలని ఉత్తర్వులు పేర్కొన్నట్లు అధికారులు వివరించారు.