News April 25, 2024
నేడు 12 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పక్రియలో భాగంగా బుధవారం 12 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు పి.వెంకట్రామ్ రెడ్డి, ఎ.లక్ష్మణ్, ఊరెళ్ళి ఎల్లయ్య, కమ్మరి లక్ష్మీనారాయణ, చిక్కులపల్లి నవీన్, ఉట్ల రమేష్ , నీలం మధు, జి.ప్రదీప్ కుమార్, ఎటి ఆంజనేయులు, ధర్మారం నరహరి, అనిల్ మొగిలి, దాసరి భాను చందర్‌లు నామినేషన్ వేశారని రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.
Similar News
News January 10, 2026
ప్రజావాణికి పెద్ద శంకరంపేటలో కలెక్టర్ హాజరు

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం (జనవరి 12) పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజలకు దూరభారం, ఖర్చులు తగ్గించేందుకు ఈ వినూత్న విధానం చేపట్టామని, ప్రతి వారం ఒక మండలంలో కలెక్టర్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 10, 2026
మెదక్: బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి: కలెక్టర్

బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం సందర్శించారు. అక్కడి పిల్లల సౌకర్యాలు, విద్య, పోషకాహారం వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న మెనూ, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. బాలల వారి సంక్షేమం, ఉన్నత భవిష్యత్‌కు ఆసక్తిని, గమనించి వారి అభివృద్ధికి చేదోడుగా ఉండాలన్నారు.
News January 10, 2026
మెదక్: ‘సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు’

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఏడు రోజుల సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయని, సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.


