News March 1, 2025
నేడు GD నెల్లూరు రానున్న CM

CM చంద్రబాబు నేడు(శనివారం) చిత్తూరు జిల్లా GD నెల్లూరులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11.50కు రామానాయుడు పల్లెకు రానున్న ఆయన మ.1 నుంచి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం 3.30కు తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News December 12, 2025
పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.
News December 11, 2025
CM సొంత నియెజకవర్గంలో గ్రానైట్ అక్రమ రవాణా.?

అది CM సొంత నియోజకవర్గం. అన్నిరంగాల్లో ముందుడాలని చంద్రబాబు అభివృద్ధి అంటుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం అందినకాడికి దోచుకో.. దాచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారట. కుప్పం గ్రానైట్కు మంచి డిమాండ్ ఉంది. దీంతో నాయకులు పగలు గ్రావెల్ రాత్రిళ్లు గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారట. YCP హయాంలో చంద్రబాబు దీనిపై క్వారీలోకి వెళ్లి మరీ పరిశీంచారు. మరి ఇప్పటి అక్రమ రవాణాపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
News December 11, 2025
చిత్తూరు: మైనర్ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4,100 జరిమానాను కోర్టు విధించినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు వెదురుకుప్పం(M) వెంగనపల్లెకు చెందిన మణి ఓ మైనర్ బాలికను ప్రేమించాలని వేధించాడు. 2020లో ఆమెను భయపెట్టి భాకరాపేటకు తీసుకువెళ్లి వివాహం చేసుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.


