News November 11, 2024
నేడు HYDలో వాటర్ బంద్
రాజధాని వాసులకు ముఖ్య గమనిక. నేడు నగరంలోని పలు ఏరియాల్లో నీటి సరఫరా ఉండదు. వాటర్ పైప్‌లైన్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నారు. అమీర్‌పేట్, SRనగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్‌పల్లి, KPHB, RCపురం, లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, అమీన్‌పూర్, జగద్గిరిగుట్ట ఏరియాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. SHARE IT
Similar News
News December 10, 2024
REWIND: ట్యాంక్‌బండ్‌లో విషాద గాథ తెలుసా?
సాగర్‌లో బుద్ధుడి విగ్రహ ప్రతిష్ఠలో పెను విషాదం జరిగింది. 1990 మార్చి 10న విగ్రహాన్ని HYDకు తీసుకొచ్చారు. పెద్ద పడవలో ఎక్కించి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అది కుదుపునకు గురైంది. విగ్రహం మెల్లిగా నీటిలోకి జారిపోవడంతో పడవలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక విగ్రహాన్ని వెలికితీసే సాహసం చేయలేదు. 1992లో నాటి CM కోట్ల విజయ భాస్కర్ రెడ్డి చొరవ చూపి డిసెంబర్ 1992లో వెలికి తీసి ప్రతిష్ఠించారు.
News December 9, 2024
HYD: సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తాం: బిర్లా గ్రూప్
రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేర నియంత్రణ కోసం సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆదిత్య బిర్లా గ్రూపు వైస్ ఛైర్మన్ రాజశ్రీ తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో సోమవారం రాజశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, నేర నియంత్రణ విధానాలు, షీ టీమ్స్ పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News December 9, 2024
గాంధీభవన్‌లో మెగా రక్తదాన శిబిరం
గాంధీ భవన్‌లో సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ ముంన్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.