News December 26, 2024

నేడు HYD నుంచి కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

image

హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో బెలగావికి సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరనున్నారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బెలగావిలో సీడబ్ల్యూసీ 26, 27వ తేదీల్లో ఈ ప్రత్యేక సమావేశాలను గ్రాండ్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తునారు. ఈ సమావేశంలో సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర సీనియర్ నేతలు కలిపి 200 మంది కీలక నేతలు పాల్గొంటారు.

Similar News

News December 14, 2025

చేవెళ్ల: కూతురుకు ఓటేసి.. తండ్రి మృతి

image

ఎన్నికల్లో పోటీచేసిన తన కూతురుకి ఓటు వేసిన ఓ తండ్రి కుప్పకూలాడు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు సోలిపేట బుచ్చయ్య (70) చనిపోయారు. ఆలూరు పంచాయతీకి అనుబంధ గ్రామం వెంకన్నగూడ 14వ వార్డులో ఆయన కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలుగా పోటీలో ఉంది. ఓటు వేసి వస్తుండగా వృద్ధుడు కుప్పకూలి మృతి చెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

News December 14, 2025

చేవెళ్ల: సర్పంచ్ ఏకగ్రీవం.. ఒకే వార్డుకు ఎన్నిక.. ఫలితం ఉప సర్పంచ్

image

చేవెళ్ల మండలం చన్వెల్లి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైన విషయం విధితమే. ఈ పంచాయతీ పరిధిలోని మొత్తం 10 వార్డులు ఉండగా 9 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 8వ వార్డు జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు సుధాకర్(SC)తో పాటు ఓసీ అభ్యర్థి పి.దీపక్ రెడ్డి పోటీ పడ్డారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో దీపక్ రెడ్డి విజయం సాధించారు. ఉప సర్పంచ్‌గా అతను ఎన్నికయ్యారు.

News December 14, 2025

RR: ఆమనగల్లు(M) శంకరకొండ సర్పంచ్‌‌గా రాములు

image

ఆమనగల్లు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శంకరకొండ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన రాములు 101 ఓట్లతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.