News July 17, 2024

నేడు MBNR, NRPTలో భారీ వర్షాలు !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో బుధవారం భారీగా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్‌ సరఫరా స్తంభించడం వంటివి జరగవచ్చని పేర్కొంది. మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి అని వెల్లడించింది.

Similar News

News November 7, 2025

హిందువులు సత్తా చాటాలి: MP డీకే అరుణ

image

2 లక్షలకు పైగా ఉన్న హిందువులంతా ఏకమై జూబ్లీహిల్స్ ఊప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బోడబండలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.

News November 7, 2025

దళితులైతే దాడులు చేస్తారా?: మందకృష్ణ మాదిగ

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయిపై కాలు, బూటుతో దాడి చేయడాన్ని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. ఆయన దళితుడు అయినందువల్లే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని పీయూ నుంచి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News November 6, 2025

మహబూబ్‌నగర్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ జాగ్రుక్ దివస్ సందర్భంగా జడ్చర్లలోని మార్కెట్ యార్డులో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే https://www.cybercrime.gov.inలో లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.