News April 24, 2024

నేడు PUలో జాతీయ సదస్సు

image

‘జీవవైవిధ్య పరిరక్షణలో ఇటీవలి పురోగతులు, స్థిరత్వం’ అనే అంశంపై ఈ నెల 23న ఉదయం 10గంటలకు పీయూ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అకాడమిక్ భవనంలో ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీయ సదస్సు కన్వీనర్, బాటనీ విభాగాధిపతి పుష్పలత తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్, విశిష్ట అతిథిగా ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు.

Similar News

News November 27, 2025

MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

News November 27, 2025

బాలానగర్‌లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

image

మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్‌లో 13.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

News November 27, 2025

MBNR: నేటి నుంచి నామినేషన్లు.. ఇవి తప్పనిసరి.!

image

✒సంబంధిత ప్రాంతం ఓటర్ లిస్టులో పేరు ఉండాలి
✒21 ఏళ్ల వయస్సు ఉండాలి
✒నిర్ణీత డిపాజిట్ సొమ్ము చెల్లించాలి
✒నేర చరిత్ర, ఆస్తులు,అఫిడవిట్ పై అభ్యర్థి ఎలక్షన్ ఖర్చు,విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి
✒SC,ST,BC వారు కుల సర్టిఫికేట్ జతచేయాలి
✒అఫిడవిట్ పై అభ్యర్థి+2 సంతకాలు ఉండాలి
✒ఎలక్షన్ ఖర్చు నిర్వహిస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి