News December 25, 2024
నేడు SRSP కాకతీయ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల: SE

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఇవాళ ఉదయం 10 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ SE శ్రీనివాస్ రావు గుప్త తెలిపారు. ఇందులో భాగంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్-1 (D5 నుంచి D53) ఆయకట్టుకు 7 రోజులు, జోన్-2 (D54 నుంచి D94) ఆయకట్టుకు 8 రోజులు సాగునీటి సరఫరా చేస్తామన్నారు. మొదట జోన్ 2కు ఏప్రిల్ 8 వరకు సాగునీటి విడుదల ఉంటుందని వివరించారు.
Similar News
News November 11, 2025
గంగుల సోదరుడి కుమారుడి పెళ్లి.. కలెక్టర్, CPకి INVITATION

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త గంగుల సుధాకర్ కుమారుడు గంగుల సాయి మనోజ్ వివాహం ఈనెల 13న జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను వారివారి కార్యాలయాల్లో కలిసిన MLA వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు తప్పకుండా హాజరుకావలసిందిగా వారిని గంగుల కోరారు.
News November 10, 2025
చొప్పదండి: 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గంగాధర మండలం రంగరావుపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన భారీ రేషన్ బియ్యాన్ని సోమవారం విజిలెన్స్ & సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 200 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, బియ్యం నిల్వ చేసిన ఇల్లు ఎవరిది? వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
‘ప్రజావాణి’కి 339 దరఖాస్తులు: జిల్లా కలెక్టర్

కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 339 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుల్లో అత్యధికంగా కరీంనగర్ నగర పాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.


