News March 31, 2025
నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులో సౌత్ బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News April 10, 2025
అమరజీవి జయంతి ఉత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

పీసీ పల్లి మండలంలో ఈనెల 16వ తేదీన జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి స్వామిని ఆర్యవైశ్య నాయకులు ఆహ్వానించారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను గురువారం కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
News April 10, 2025
కలెక్టర్ అన్సారీయాకు ఆహ్వానం

కనిగిరిలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 16న జరిగే అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలకు రావాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను గురువారం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కలిసి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అన్సారియా జయంతి ఉత్సవాల్లో తప్పక పాల్గొంటామని హామీ ఇచ్చినట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు.
News April 10, 2025
నారాలోకేశ్ సూచనతో చేబ్రోలు కిరణ్ దూషణలు: ఎమ్మెల్యే తాటిపర్తి

జగన్ కుటుంబంపై చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ‘విశృంఖలంగా, విచ్చలవిడిగా, వికృతంగా, వినాశనంగా, విపరీతంగా టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా పోటీపడి మరి వైసీపీ నాయకులపై, వారి కుటుంబాలపై చేస్తున్న ‘మానసిక సామూహిక ఉన్మాదం’ తారాస్థాయికి చేరిందని చెప్పటానికి సాక్ష్యం నారా లోకేశ్ సూచనతో కిరణ్ చేసిన దూషణలే’ అంటూ గురువారం ట్వీట్ చేశారు.