News April 25, 2024

నేడే ఇంటర్ ఫలితాలు.. ఉమ్మడి ఖమ్మం నుంచి ఎంత మంది అంటే

image

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. ఖమ్మం జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 36,578 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 19,477 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.

Similar News

News January 17, 2025

ఖమ్మం: వైరా సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు

image

ఖమ్మం జిల్లా వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయడంపై విమర్శలు వచ్చాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. ఎల్‌ఆర్‌ఎస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం, 10 పాట్లు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.

News January 17, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అశ్వరావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్న రేషన్ కార్డుల సర్వే

News January 16, 2025

కనులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.