News December 26, 2024

నేడే ఉమ్మడి కృష్ణాజిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపిక

image

పొన్నవరం గ్రామంలోని ఏకత్వా పాఠశాలలో గురువారం సాయంత్రం మూడు గంటలకు ఉమ్మడి కృష్ణాజిల్లా ఫెన్సింగ్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫెన్సింగ్ సంఘ కార్యదర్శి నాగం సతీష్ తెలిపారు. ఈ పోటీలకు 2008 జనవరి నుంచి 2011 డిసెంబరు మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 

Similar News

News January 25, 2025

మూడో స్థానంలో కృష్ణా జిల్లా

image

సాయుధ దళాల పతాక నిధి సేకరణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి సర్జన్ లెఫ్ట్నెంట్ కల్నల్ డాక్టర్ కె. కళ్యాణ వీణ శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి డిసెంబర్‌లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మెమెంటో తీసుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ మెమెంటోను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి అందజేశారు.

News January 24, 2025

పెనమలూరు: హత్య కేసులో నిందితుడు అరెస్ట్

image

హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పెనమలూరు పోలీసులు తెలిపారు. సీఐ వెంకట్ రమణ తెలిపిన సమాచారం మేరకు ఈ నెల 9వ తారీఖున పోరంకి ప్రభు నగర్‌కు చెందిన ఉమ్మడి రాణి అనే మహిళను తన అల్లుడైన నారబోయిన నరేశ్ హత్య చేశాడు. ఆప్పటినుంచి పరారీలో ఉన్న నరేశ్‌ను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడిని న్యాయమూర్తిగా హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు శుక్రవారం తెలిపారు.

News January 24, 2025

కోడూరు: అంగన్వాడీ సెంటర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు 

image

కలెక్టర్ డీకే. బాలాజీ కోడూరు మండల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉల్లిపాలెం అంగన్వాడీ సెంటర్‌లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పిల్లల అటెండెన్స్, వంటశాల, మంచి నీటి వసతి, గ్రోత్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ స్వయంగా పిల్లల వెయిట్‌ను పరిశీలించారు. రిజిస్టర్‌లో చూపించిన రేగులర్ పేర్ల పిల్లలు లేకుండా అంగన్వాడీలో వేరే పిల్లలు ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.